'పెద్ది' మూవీ కెమెరా యాంగిల్స్‌పై జాన్వీ కపూర్ అప్పుడే అభ్యంతరం?.. లీకైన చాట్స్ వైరల్!

  • 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘పెద్ది’ సినిమా
  • మూవీలో జాన్వీకపూర్ పాత్ర తీరుపై వివాదం
  • ఆమె శరీరాకృతిని అసభ్యకరమైన యాంగిల్స్‌లో చూపారంటూ విమర్శలు
  • విమర్శలు వెల్లువెత్తడంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణ 
  • షూటింగ్ సమయంలోనే ఈ యాంగిల్స్‌ను వ్యతిరేకించిన జాన్వి
  • ఆమెకు మద్దతుగా నిలిచిన రామ్‌‌చరణ్ 
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్నప్పటికీ, సినిమాను చుట్టుముట్టిన వివాదాలు మాత్రం తగ్గడం లేదు. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. కానీ, ఈ చిత్రంలో జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియ్యమ్మ' పాత్రను కేవలం గ్లామర్ కోణంలో, అసభ్యకరమైన కెమెరా యాంగిల్స్‌తో చూపించారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ వివాదం ఇలా ఉంచితే, తాజాగా జాన్వీ కపూర్ అభిమానుల పేజీల ద్వారా కొన్ని ప్రైవేట్ చాట్ స్క్రీన్‌షాట్లు, వీడియోలు బయటకు రావడం సంచలనం సృష్టిస్తోంది. గతేడాది అక్టోబర్ 30 నాటివిగా భావిస్తున్న ఈ సందేశాల ప్రకారం.. షూటింగ్ సమయంలోనే జాన్వీ కపూర్ కొన్ని వివాదాస్పద షాట్స్‌ను తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. "నా చెస్ట్, నడుము భాగాలను ఫోకస్ చేసే షాట్స్ (No bb and waist shots) వద్దని నేను ముందే దర్శకుడికి చెప్పాను" అని జాన్వీ ఆ చాట్‌లో పేర్కొంది. అంతేకాకుండా, తోటి నటుడు రామ్ చరణ్ ఈ విషయంలో తనకు అండగా నిలిచారని, సదరు కెమెరా యాంగిల్స్ తీయవద్దని దర్శకుడిని గట్టిగా మందలించారని ఆ చాట్స్‌లో పేర్కొంది. "రామ్ సార్ చాలా మంచివారు, ఈ ఇండస్ట్రీలోనే ఆయన బెస్ట్" అని ఆమె పేర్కొన్నట్లు లీకైన చాట్స్ చెబుతున్నాయి. అయితే, ఈ స్క్రీన్‌షాట్లపై జాన్వీ కపూర్ కానీ, రామ్ చరణ్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

దర్శకుడు బుచ్చిబాబు బహిరంగ క్షమాపణలు
ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో 'ఉప్పెన' ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ క్షమాపణలులు చెప్పారు. "ఒక సినిమా ఎప్పుడూ ప్రేక్షకులను అలరించాలి, ఉత్తేజపరచాలి అంతే తప్ప ఎవరినీ అసౌకర్యానికి లేదా అవమానానికి గురిచేయకూడదు. 'పెద్ది' చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై వస్తున్న విమర్శలను మేము తీవ్రంగా పరిగణించాం. తెరపై, నిజ జీవితంలో నాకు మహిళల పట్ల అపారమైన గౌరవం ఉంది. ఏ పాత్రనూ తక్కువ చేసి చూపించడం మా ఉద్దేశం కాదు. ప్రేక్షకుల సెంటిమెంట్లను గౌరవిస్తూ, వివాదాస్పదమైన ఆ భాగాలను తక్షణమే రీ-ఎడిట్ (మార్పులు) చేయాలని నిర్ణయించాం" అని ఆయన ఎక్స్ వేదికగా స్పష్టం చేశాడు.

ఈ లీకైన చాట్స్‌లో జాన్వీ కపూర్ "సౌత్ ఇండస్ట్రీలో ఇలాంటివి తరచూ జరుగుతుంటాయి" అని వ్యాఖ్యానించినట్లు ఉన్న అంశం ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారితీసింది. గతంలో 'గేమ్ చేంజర్' సినిమాలో కియారా అద్వానీ పాత్రపై వచ్చిన విమర్శలను కూడా అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 

Janhvi Kapoor
Ram Charan
Buchi Babu Sana
Peddi Movie
Peddi Controversy
Leaked Chats
Telugu Cinema
Peddi Movie Re-edit
South Industry News
Peddi Box Office

More Telugu News